NLR: సంగంలోని కామాక్షీ దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పులి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. హేమంత్ కృష్ణ అనే ప్రముఖ కళాకారుడు ముక్కుతో ఫ్లూట్ వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు.