W.G: నరసాపురం క్రిస్టియన్ ఆస్పత్రి సమీపంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నరసాపురం, పాలకొల్లు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద ధాటికి రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.