KNL: వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపుకు గురై ఆర్థికంగా నష్టపోయామని, నామినేటెడ్ పదవి కేటాయించి న్యాయం చేయాలని ఆదోని మాజీ కౌన్సిలర్ రంగన్న కోరారు. శుక్రవారం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబును కలిసి నామినేటెడ్ ఇవ్వాలని అర్హత పత్రాలను సమర్పించారు. వైసీపీ నాయకులు తన కొబ్బరి, ఎర్రచందనం తోటకు నిప్పు పెట్టి సుమారు 40 లక్షల నష్టాన్ని కలిగించారన్నారు.