GNTR: తెనాలి మండలం జగ్గడగుంటపాలెంలో 2021లో జరిగిన దాడి కేసులో నిందితుడు శివనాగమల్లేశ్వరరావుకు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పునిచ్చారు. నాగరాజు అనే వ్యక్తిపై కత్తిపీటతో దాడి చేసినందుకు గాను సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సునీల్ కుమార్ వాదనలు వినిపించారు.