VSP: భీమిలి పరిధిలోని మంగమారిపేట వద్ద ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందడంతో భీమిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.