కడప నగరంలోని గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి (బాలాజీ) దేవస్థానంలో నిర్వహించిన పాసురం ధనుర్మాస పూజ కార్యక్రమంలో కడప మేయర్ పాక సురేష్ కుమార్ ఆయన సతీమణి రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ విజయ్ బట్టర్ స్వామి ఆశీర్వచనం చేశారు.