KRNL: జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి.శ్రీనివాస్ ఇవాళ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డా. ఎ.సిరి అధ్యక్షతన జేడీ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ-వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.