E.G: మొంథా తుఫాను ధాటికి జిల్లాలోని 33,262 మంది రైతులకు చెందిన 41,350 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతో సుమారు రూ. 40.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తుఫాను సంభవించి నెల రోజులు గడిచినా, ఇంతవరకు పంట నష్టపరిహారం అందకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.