ATP: తాడిపత్రి మండలంలోని చల్లవారిపల్లి – తాడిపత్రి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఎల్లనూరు రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లెవెల్ క్రాసింగ్ ఓవర్ హాలింగ్ పనుల నిమిత్తం మే 26 నుంచి మే 30 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గేటును మూసివేస్తారు. వాహనదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.