VSP: తన వాట్సాప్ స్టేటస్ ఫొటోలను డౌన్ లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి (నగ్నంగా ఉండేటట్లు చిత్రికరించి) సోషల్ మీడియాలో పెట్టినట్టు ఓ మహిళ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్య తేజ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.