SKLM: రణస్థలం మెంటాడకు చెందిన ఎస్.సూరిరెడ్డి (34) మద్యంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న అతడు మద్యానికి బానిసై కుటుంబంతో తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో శనివారం విషం తాగిన అనంతరం తల్లికి విషయం చెప్పగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.