ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వ్యక్తిగత పనుల నిమిత్తం డిసెంబర్ 22వ తేదీ నుంచి 13 రోజులపాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆయన జనవరి 4న జిల్లాకు తిరిగి రానున్నారు. అయితే IAS అధికారులు విదేశీ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జేసీ పర్యటనకు ప్రభుత్వం బుధవారం అనుమతి మంజూరు చేసింది.