NLR: అభివృద్ధి అంటే రాళ్లు వేసి వెళ్లిపోవడం కాదని, పని పూర్తి చేయడమని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చి మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్లో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాము పూర్తి చేసిన పనిని వైసీపీ తన ఖాతాలోకి వేసుకుంటోందన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన పనులను పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.