అన్నమయ్య: రాయచోటి TDP కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఇవాళ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి, అలాగే ప్రసాద్ బాబు 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.