కోనసీమ: కొత్తపేట గ్రామంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా 15వ తేదీన జరగనున్న ప్రభల తీర్థం ప్రదేశాన్ని కొత్తపేట DSP సుంకర మురళీమోహన్‌తో కలిసి శనివారం పరిశీలించారు. బందోబస్తు, ద్విచక్ర వాహనాలు, 4- వీలర్ వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ మొదలగు అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.