SKLM: మెలియాపుట్టి మండలం చాపర హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా 14వ కౌన్సిల్ సమావేశం యూటీఎఫ్ నాయకులు నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం హాజరయ్యారు. ముందుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.