KDP: బద్వేలులోని సిద్ధవటం రోడ్ మార్కెట్ యార్డు వద్ద నూతనంగా రైతు బజార్ నిర్మించారు. మార్కెట్ జరిగేందుకు సర్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే రైతు బజారు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది బద్వేలు చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఉపయోగకరంగా మారనుంది. తమ పంటను తామే అమ్ముకొనే సదుపాయం ఉన్నందున రైతులకు మంచి రాబడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.