NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరెడ్డి, వైద్య అధికారి పద్మజ, సీనియర్ టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి పాల్గొని గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణీలందరూ పోషకాలతో కూడిన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.