ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో DRDA ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు-మన లెక్కలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 32.47 లక్షల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జెండర్స్ రిసోర్స్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.