కడప: కాకినాడకు చెందిన శ్రీకృష్ణ పరివార సేవా సంఘం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం భక్తులు మంగళవారం రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని చేరుకున్నారు. కాకినాడ నుంచి ఇరుముడి చేతబట్టి ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ.. శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.