ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మన్నీల ఫైరింగ్ రేంజ్ మైదానంలో రెండో రోజు శనివారం పోలీసుల ఫైరింగ్ సాధన కొనసాగింది. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ట్రైనీ ఐపీఎస్ అశ్విని మణిదీప్ ఆధ్వర్యంలో సిబ్బందికి ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ ప్రాయోగిక శిక్షణ నిర్వహించారు.