కోనసీమ: నేటి రోజుల్లో యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలని కొత్తపేట రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలు, భవిష్యత్తుపై పడే ప్రభావాలను వివరించారు.