అన్నమయ్య: కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్ను శనివారం మదనపల్లె DSP మహేంద్ర తనిఖీ చేశారు. నేరాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి, సీఐ, ఎస్సైలతో పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. ప్రజలతో పోలీసులు సన్నిహితంగా ఉండాలని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన సూచించారు.