విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు.