SKLM: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై గురువారం కేసు నమోదైంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. నిబంధనల ఉల్లంఘన కారణంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మీ తెలిపారు.