నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు. వీఆర్సీ తరహాలో సిద్ధమౌతున్న ఆర్ఎస్ఆర్ స్కూల్, మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.