GNTR: వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఆదివారం ఎన్.టి. రామారావు కాంస్య విగ్రహాన్ని పెమ్మసాని చంద్రశేఖర్, డా. బూర్ల రామాంజనేయులు ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసి, రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు.