E.G: దేవరపల్లిలో కొన్ని చోట్ల కుక్కల బెదడ తీవ్రతరమైంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కల వల్ల గ్రామ ప్రజలు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన దారిపై ద్విచక్ర వాహనాలకు అడ్డుగా వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను తరలించాల్సిందిగా స్థానికులు అధికారులకు విన్నవించుకున్నారు.