TPT: రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. యూనిట్లో చేపడుతున్న పనులను ఆయన ప్రత్యక్షంగా గమనించారు. ప్రాసెసింగ్ విధానాలు, శుద్ధి యంత్రాల పనితీరుపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య ఉన్నారు.