శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలోని జిల్లా స్థాయి పురుషులు, మహిళల కోసం నూతన క్రికెట్ శిక్షణ కేంద్రాన్ని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.