SKLM: మందస మండలం కొంకడాపుట్టి పంచాయతీలో సచివాలయం భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సచివాలయం నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో వేరేచోట సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సొంత సచివాలయ నిర్మాణ భవనాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.