ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న చేబ్రోలు ది. విశాల సహకార సంఘంను జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి శనివారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, స్థానిక నేతలతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా రైతులు ఖరీఫ్ వరి పంటకు అవసరమైన ఎరువులను సొసైటీ నుండి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.