GNTR: వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్.టి. రామారావు విగ్రహాన్ని ఆదివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పాల్గొన్నారు.