E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఫూట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు, వర్సిటీ జట్టు ఎంపికలు ఈ నెల 9, 10 తేదీల్లో రాజమండ్రిలోని ఎస్ కేవీటీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ తిరుపణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు.