NDL: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్ను విచారించారు.