GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని నల్లపాడు మిర్చి యార్డ్ సమీపంలో గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను ఎస్సై మహేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2.10 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వంశీధర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.