NTR: విజయవాడ BRTS రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బైక్ రైడర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. హెల్మెట్ ధరించి సక్రమ మార్గంలో వెళ్తున్న బైక్‌ను, ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వన్‌వే నియమాలు ఉల్లంఘించి తప్పుడు దిశలో తిరగడంతో ఢీకొట్టాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని కేవలం చిన్నపాటి గాయంతో బయటపడ్డాడు.