KNRL: బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూల్ కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న ప్రసాద్ రెడ్డి (19) బావిలో శవమై తేలాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. యువకుడి మృతితో ముద్దవరం గ్రామంలో విషాదం నెలకొంది.