సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కురుబ సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కురుబ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.