NLR: కోవూరు మండలం పడుగుపాడు రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాల్లో లబ్ధిదారులు బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, MLA వేమిరెడ్డి ప్రశాతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. MLA మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను ఇచ్చారని తెలిపారు.