CTR: పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామ రైతుసేవా కేంద్రంలో మంగళవారం రాయితీ ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఈసారి సమయానుకూలంగా అందించడంతో గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు రెడ్డప్ప, మనోజ్, అధికారులు కలిసి ప్రారంభించి పంపిణీ చేశారు.