W.G: తణుకు మండలం ముద్దాపురానికి చెందిన యువతి సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగ హరితకు తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి కోసం సవతి తల్లి రూప, తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్ 2022 నవంబర్ 12న హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో హత్యగా నిర్ధారణ కావడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.