CTR: పలమనేరు పెద్ద చెరువు సమీపంలోని ప్రభుత్వ పోరంబోకు స్థలం కబ్జాకు గురవుతోందని, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, ఆర్ఎంబీ, అటవీశాఖల అధికారులు కాపాడలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ విలువైన స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. బహిరంగంగా జరుగుతున్న ఈ కబ్జాపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.