SKLM: కోటబొమ్మాలి (M) కొత్తమ్మ తల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఎస్. గణపతి శర్మకు కూటమి ప్రభుత్వం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకమండలి సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ను కలిసి గణపతి శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి,భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.