GNTR: తెనాలి టెలిఫోన్ ఎక్సేంజ్ రోడ్డులో మంగళవారం ఉదయం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కాలువ గట్టున ఉన్న సిమెంట్ స్తంభం కుంగిపోవడంతో, ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ మీదకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేశారు.