ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో కామేపల్లి రైతులు 1430 బేళ్లు తీసుకురాగా, కేవలం 610 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 820 బేళ్లను తిరస్కరించారు. వేలం కేంద్రం మూసివేసే దశలో తిరస్కరణలు పెరగడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో బేళ్లను తిరస్కరించడం రైతులకు శాపంగా మారి, తమ పొగాకును ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు