GNTR: తెనాలి టీచర్స్ కాలనీలో ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ దారుణ హత్యకు గురైన ప్రాంతాన్ని డీఎస్పీ జనార్ధన రావు, సీఐ సాంబశివరావు శనివారం ఉదయం పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయంలో ఫయాజ్ తనకు పరిచయం ఉన్న మహిళ ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. అక్కడే కాపు కాసి ఉన్న దుండగులు కర్రలు, బండరాళ్లతో మోది ఫయాజ్ను హతమార్చారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు.