కోనసీమ: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 11న రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వైస్ ప్రిన్సిపల్ యు.రమేశ్ బాబు తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను జేకేసీ కోఆర్డినేటర్ కె.రజినితో కలిసి విడుదల చేశారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.ధ్రువపత్రాలతో హాజరవ్వాలని ఆయన కోరారు.