GNTR: టాస్క్ ఫోర్స్ బృందం పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. చేబ్రోలు, తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిల్లో గురువారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 12 సెల్ఫోన్లు, రూ. 13,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.