E.G: మే 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు-2026 విజయవంతానికి కొవ్వూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్, బూత్ స్థాయి నాయకులు భారీ ఎత్తున మహానాడులో పాల్గొని పార్టీ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.